వర్మ ఎన్టీఆర్….పబ్లిసిటీ పీక్స్…విషయం వీక్ !

Varma Lakshmi's NTR Sensor Talk Revealed

నా సినిమా చూడండి ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అసలు నిజాలు ఏంటో చూపిస్తానే ప్రమోషన్ తాక్ట్టీస్ తో కొన్ని రోజులుగా చాలా హడావిడి చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. ఈయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా ఈ సినిమాలో చాలా విషయం ఉందని అప్పట్లో ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాన్ని ఈయన కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాడని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర సెన్సార్ పూర్తి కావడంతో ఇండస్ట్రీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి కొన్ని నిజాలు బయటికి వచ్చాయి. సెన్సార్ పూర్తయిన తర్వాత ఈ సినిమాను వర్మ ఆఫీసులో కొదరు పెద్దమనుశులకి చూపించారట. అలా సినిమా చూసొచ్చిన వాళ్లు ఈ సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత నిజానికి బయట జరుగుతున్న ప్రచారం అబద్ధమని తేల్చేశారు.

సినిమాలో పెద్దగా విషయం లేదని అదంతా కేవలం థియేటర్ కి జనాన్ని రప్పించడానికే అని వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారట. నిజాలు చూపిస్థానాన్న వర్మ ఈ సినిమా చాలా చప్పగా తీశాడని ఎక్కడా ఎమోషన్స్ పెద్దగా వర్కవుట్ కాలేదని చెబుతున్నారు వాళ్ళు. అంతగా భయపడాల్సిన పని లేదని లక్ష్మీస్ ఎన్టీఆర్ లో పబ్లిసిటీ పీక్స్ విషయం వీక్ అని చెబుతున్నారు. కీలకంగా భావిస్తున్న వైస్రాయ్ ఎపిసోడ్ కూడా అంతగా ఆకట్టుకోలేదని ముఖ్యంగా క్వాలిటీ విషయంలో వర్మ అసలు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శలు వినవస్తున్నాయి. అయితే ఇలా నెగటివ్ టాక్ విడుదలకు ముందు కావాలని చేస్తున్నారా లేదంటే నిజంగానే సినిమా అలా ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్ మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వర్మ ప్రమోషన్ టెక్నిక్స్ అలాంటివి మరి.