ప్రభాస్ చెంప చెళ్ళుమనిపించిన లేడీ…ఎందుకంటే ?

Prabhas Met A Crazy Lady Fan

బాహుబ‌లి సినిమాతో న‌టుడు ప్ర‌భాస్‌ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు నుండే ఆయన‌కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ‌. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా వారి హృద‌యాలు దోచుకునే ప్ర‌భాస్ పేరు వింటేనే వారు ప‌ర‌వ‌శించిపోతారు. అలాంటిది స్వ‌యంగా ఎదురుగా క‌నిపిస్తే వాళ్ళు ఏమైపోతారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవడం ఖాయం. ఇప్పుడు కూడా అదే జరిగింది ఆయన ప్రస్తుతం సాహో చిత్రంతో పాటు రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్‌తో బిజీగా ఉన్నాడు.

అయితే సాహో చిత్రీక‌ర‌ణ కోసం ఇటీవ‌ల‌ లాస్ ఏంజెల్స్ వెళ్ళారు ప్ర‌భాస్‌. అక్క‌డ ఎయిర్ పోర్ట్‌లో ప్ర‌భాస్‌ని చూసిన ఫ్యాన్స్ ఆయ‌న‌తో ఫోటో దిగేందుకు ప‌రుగులు తీసారు. ఓ అమ్మాయి ప్ర‌భాస్‌తో ఫోటో దిగిన వెంట‌నే ఎగిరి గంతులు వేస్తూ ప్ర‌భాస్ చెంపని కొట్టింది. దీంతో ఒక్క‌సారి షాక్ అయ్యారు ప్ర‌భాస్‌. వెంటనే తేరుకుని మిగ‌తా అభిమానులతోను ప్ర‌భాస్ ఫోటోలు దిగి వారిని ఆనంద‌ప‌ర‌చారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న‌ సాహో చిత్రంకి సంబంధించి ఇటీవ‌ల ఓ వీడియో విడుద‌ల కాగా, ఇందులో ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్ లుక్స్ అభిమానుల‌ని ఆక‌ట్టుకున్నాయి. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమా రిలీజ్ కానుంది.