టీడీపీకి షాకిచ్చిన మరో ఎమ్మెల్యే…జగన్ గూటికి చేరిక !

TDP MLA Venugopal Reddy Join In YCP

అనుకున్నట్టే అయ్యింది, కొంతకాలం నుంచి టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీని వీడేందుకు నిర్ణయించుకుని పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి అధికారికంగా వైసీపీ గూటికి చేరబోతున్నట్టు సమాచారం. 2009లో టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీగా విజయం సాధించిన మోదుగుల 2014లో టీడీపీ తరపున గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

అయితే చాలాకాలంగా తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే భావనతో ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని పలుసార్లు బహిరంగంగానే వ్యక్తం చేశారు. అలా కొద్దిరోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న మోదుగుల నల్లచొక్కాలతో టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన సమయంలోనూ తెల్ల చొక్కాతోనే అసెంబ్లీకి వచ్చి పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీని వీడటం ఖాయమనే భావనలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఆయన పేరును పరిశీలనలో కూడా తీసుకోలేదు చంద్రబాబు. దీంతో ఆయన తనదారి తాను చూసుకున్నట్టు సమాచారం అయితే మరోవైపు వైసీపీలో చేరబోయే మోదుగుల ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే అంశం కూడా ఆసక్తికరంగా మారంది. ఆయన గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీ స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉందని కొందరంటుంటే ఈ సారి మోదుగుల సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏమవనుందో ?