కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కళ్ళు నెత్తికెక్కాయి – హరీష్ రావు

When the Congress party came to power, the eyes became bloodshot - Harish Rao
When the Congress party came to power, the eyes became bloodshot - Harish Rao

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళ్ళు నెత్తికెక్కాయని మాజీ మంత్రి హరీష్‌ రావు ఫుల్ ఫైర్‌ అయ్యారు. సంగారెడ్డి లో రైతు దీక్షలో పాల్గొన్న హరీష్‌ రావు గారు మాట్లాడుతూ… రైతు బంధు రాలేదు అంటే కోమటిరెడ్డి చెప్పుతో కొడుతా అని అంటాడు… కేసీఆర్ హయాంలో పంటలు పండటం తప్ప ఎండటం తెలియదు అని అన్నారు . కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో కరువు వచ్చింది … ఈ రోజు రాహుల్ గాంధీ కొత్త మేనిఫెస్టో పెడుతారంట ..? అంటూ నిలదీశారు.

When the Congress party came to power, the eyes became bloodshot - Harish Rao
When the Congress party came to power, the eyes became bloodshot – Harish Rao

అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోనే నెరవేర్చలేదు… ఇంకా ఈ కొత్త మేనిఫెస్టో ఎందుకు..? రైతులెవరు ఆత్మస్తైర్యాన్ని కోల్పోవద్దు..రైతులకి BRS పార్టీ అండగా ఉంటుందన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకి సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ కాలు పెట్టగానే బీజేపీ కళ్ళు తెరిచి దీక్షలు కూడా చేస్తున్నారు… బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో అని అన్నారు. కేసీఆర్ హయాంలో పంట బాగా పడితే బిజెపి మేము కొనము నూకలు బుక్కమని చెప్పింది…నూకలు బుక్కమని చెప్పిన బీజేపీకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కోరారు. పంట ఎండిపోయిన రైతులకి వెంటనే ఎకరానికి 25 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు మంత్రి హరీష్‌ రావు.