‘ఫ్యామిలీ స్టార్’ మొదటి రోజు కలెక్షన్స్: విజయ్‌కు మరోసారి షాక్!

'Family Star' First Day Collections: Vijay Shocked Again!
'Family Star' First Day Collections: Vijay Shocked Again!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ద ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5వ తేదీన శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులు, అభిమానులను అలరిస్తోంది. గీతాగోవిందం లాంటి మూవీ తర్వాత పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన మూవీ కావడంతో భారీగా హైప్ ఏర్పడింది. అయితే ఈ మూవీ ఆ అంచనాలను చేరుకోలేకపోయినట్లు సమాచారం. ఈ మూవీ కి మిక్స్​డ్​ రివ్యూస్ వస్తున్నాయి.

'Family Star' First Day Collections: Vijay Shocked Again!
‘Family Star’ First Day Collections: Vijay Shocked Again!

దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ కుటుంబ కథా మూవీ థియేటర్లో కాస్త నిరాశనే మిగిల్చిందని తెలుస్తుంది . ఈ మూవీ తో తొలిరోజు కలెక్షన్లు ఇండియా వైడ్​గా రూ.5.75 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి . తొలి రోజు థియేటర్ ఆక్యుపెన్సీ కేవలం 38.45 శాతం మాత్రమే అని, మార్నింగ్ షో 37.21 శాతం, మధ్యాహ్నం షో 40.85శాతం, ఈవెనింగ్ షో 34.81శాతం, నైట్ షోకు 40.92శాతం మాత్రమే థియేటర్లు నిండినట్లు తెలుస్తుంది . యూఎస్​లో మాత్రం మంచి రెస్పాన్స్ రావడంతో 475కే డాలర్లుకుపైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.