TG Politics: తమిళిసైకి మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌

TG Politics: Janasena Party chief Pawan Kalyan supports Tamilisai
TG Politics: Janasena Party chief Pawan Kalyan supports Tamilisai

తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్‌ తమిళసై కోసం జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ రంగంలోకి దిగుతున్నారు. నేడు తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా చెన్నై సౌత్‌లో తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి తమిళిసైకి మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ రోడ్డు షో ఉంటుంది. అనంతరం చెన్నైలో సాయంత్రం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉంటుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసారు.

కాగా… జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇటీవలే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని పిటిషన్ వేసింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అయితే.. ఈ కేసును విచారించిన ఏపీ హై కోర్టు… జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ డిస్మిస్ చేసింది.