Election Updates: ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజు.. ఇదే షెడ్యూల్..

Election Updates: Today is the 5th day of our bus trip.. This is the schedule..
Election Updates: Today is the 5th day of our bus trip.. This is the schedule..

నేడు 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని సంజీవపురం బస చేసిన ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ ఎస్ పి కొట్టల, బత్తలపల్లి, మలకవేముల మీదుగా పట్నం వరకు సీఎం జగన్‌ రోడ్ షో కొనసాగనుంది.

పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుళ్ల వద్ద సీఎం జగన్‌ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. కదిరి పట్టణం చేరుకుని పి వి ఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సిఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్న పేట, ఎస్ ములకలపల్లె, మీదుగా వెళ్లి చీకటిమనిపల్లెలో రాత్రి బస చేస్తారు సీఎం జగన్‌.