లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కాకూడదని ఫిర్యాదు…అయి తీరుతుందన్న వర్మ !

TDP Leaders Fils Fitishan Against Lakshmi's NTR

రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. విడుదలను ఆపాలని దేవీబాబు చౌదరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలపై ప్రభావం చూపేలా సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాలో చంద్రబాబు పాత్రను నెగిటివ్‌గా చూపించారని దేవీబాబు ఫిర్యాదు లేఖలో వివరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా విడుదల ఆపాలని దేవీబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదు కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. రాంగోపాల్ వర్మ ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్‌లో తలమునకలయ్యాడు.

ఈ నెల 22న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేయనున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించాడు. నీ నేపధ్యంలో చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు చేసిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీని కలిసి ఈ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వర్మ సోషల్ మీడియా వేదికగా టీడీపీ పార్టీపై ఫైర్ అయ్యారు. ఎలాంటి ఫోర్స్ తన సినిమాను థియేటర్ లోకి రాకుండా ఆపలేదని ట్వీట్ చేశాడు. టీడీపీ పార్టీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్ ఆపాలని ఎలెక్షన్ కమీషన్ ని సంప్రదించిందని కానీ ఎవ్వరూ కూడా నిజాన్ని ఆపలేరంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.