లక్ష్మిస్ ఎన్టీఆర్ లేటెస్ట్ అప్డేట్…!

Lakshmi NTR Will Come Alive On The Death Anniversary Of NTR Says RGV

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను రాంగోపాల్ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ పేరుతో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను అయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో రూపొందించాడు. ఆ చిత్రంను దర్శకుడు క్రిష్ తెరకెక్కించాడు. బాలకృష్ణ ముఖ్య పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా విడుదలవుతుంది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు. రెండోవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు. ఎన్టీఆర్ కథానాయకుడు ఈ సంక్రాంతికి విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.

రాంగోపాల్ వర్మ కూడా లక్ష్మిస్ ఎన్టీఆర్ పేరుతో రూపొందిస్తూ అసలు ఎన్టీఆర్ జీవితాన్ని నా సినిమాలో మాత్రమే మీరు చూస్తారు. నేను చూపిస్తానని ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన రోజే వర్మ శపధం చేశాడు. ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి జనవరి 18 కావున, వర్మ సోషల్ మీడియా ద్వార ఓ మెసేజ్ ను పంపించారు. ఎన్టీఆర్ వర్ధంతి జనవరి 18న కావున ఈ రోజు సాయంత్రం లక్ష్మిస్ ఎన్టీఆర్ ప్రాణం పోసుకోబోతుంది అన్నారు. అంటే ఈ చిత్రం నుండి టిజర్ ను రీలిజ్ చేస్తాడా లేకపోతె ట్రైలర్ ను విడుదల చేస్తాడాని వర్మకు సోషల్ మీడియా ద్వార కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా మీ నుండి వస్తున్నా లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రంపై మాకు మరింత ఆసక్తి ఏర్పడుతుందని వర్మకు కామెంట్స్ పెడుతున్నారు. మరో వైపు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంది తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కూడా వర్మ పై రివర్స్ కౌంటర్ వెయ్యడానికి సిద్దంగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ రోజు ఈవెనింగ్ వరకు అగాలిసిందే.