లక్ష్మిస్ ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతి ఇదుగో…!

Lakshmi Parvathi First Look In Lakhmis NTR

క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందింది. ఈ చిత్రంను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు. రెండోవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ రెండు భాగాల్లో మొదటి భాగం కథానాయకుడు ఈ బుధవారం విడుదలై ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఇంకా ఎన్నో విషయాలను తనలోనే దాచుకుంది. ఎన్టీఆర్ బయోపిక్ నేపద్యలోనే, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ అనే టైటిల్ తో ఎన్టీఆర్ జీవితాని రూపొందిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితాని తానే కరెక్ట్ గా తెరపై చూపిస్తానంటూ లక్ష్మిస్ ఎన్టీఆర్ ను తెరపైకి తీసుకువచ్చాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ చిత్రంలో నటించిన నటీమణుల ఫస్ట్ లుక్ లను ఒక్కొకటి విడుదల చేస్తూ ఎన్టీఆర్ బయోపిక్ పై మంచి హైప్ తీసుకువచ్చాడు.

Lakshmi Parvathi First Look In Lakhmis NTR

రాంగోపాల్ వర్మ కూడా లక్ష్మిస్ ఎన్టీఆర్ లోని, ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనలను మరియు వ్యక్తులను ఒక్కొక్కరి చొప్పున ఫస్ట్ లుక్ రూపంలో విడుదల చేస్తున్నాడు. అందులో లక్ష్మి పార్వతికి సంబందించిన ఫస్ట్ లుక్ ను తాజాగా వర్మ విడుదల చేశాడు. ఆ రోజుల్లో లక్ష్మి పార్వతి ఎలాఉంటుందో అచ్చం అదే రీతిలో ఆమె లుక్ ను విడుదల చేశాడు. లక్ష్మి పార్వతి ఫస్ట్ లుక్ గమనించినట్లైతే లక్ష్మి పార్వతి బ్యాక్ గ్రౌండ్ మొత్తం పూర్తిగా బ్లాకు రంగులోను, నుదిటి మీద పెద్ద సైజు లో బొట్టుతో మొఖంలో ఏదో తెలియని బాధతో, కండ్లలో కన్నీటి భాధతో వర్మ లక్ష్మి పార్వతి ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. వర్మ లక్ష్మి పార్వతి ఫస్ట్ లుక్ కంటే ముందు “ఎందుకు” అనే సాంగ్ ను విడుదల చేశాడు. ఆ సాంగ్ లో లక్ష్మి పార్వతికి వ్యతిరేకంగా ఉన్నా కానీ అందులో చాలా లోతైనా భాధ ఉన్నదని ఒకనోక్క సందర్బంలో లక్ష్మి పార్వతి చెప్పుకువచ్చింది. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నిజలకంటే. లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాలోనే ఎక్కువ నిజాలు ఉంటాయని రాంగోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకువచ్చాడు. ఈ చిత్రంను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కానున్నది