తమిళ పింక్ హైదరాబాద్ లో…!

Tamil Remake Of Pink Vidya Balan Joins Ajith

తల అజిత్ వరస విజయాలతో దుసుకెల్లుతున్నాడు. తాజాగా అయన శౌర్యం శివ దర్శకత్వంలో నటించిన విశ్వాసం చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ ను అండ్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నయనతార కథానాయకగా నటించింది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ ఈ నెల 25న విడుదలవుతుంది. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతుంది. ఈ నేపద్యంలోనే తల అజిత్ హింది చిత్రం పింక్ రీమేక్ లో నటించనున్నాడు. అందుకు సంబందించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పింక్ రీమేక్ యొక్క షూటింగ్ ఫిబ్రవరిలో మొదలవుతుంది. పింక్ చిత్రంలో నటించిన తాప్సి పాత్రలో కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన నటి శ్రద్దా శ్రీనాద్ నటిస్తారు.

ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లోనే ఎక్కువ భాగం జరగనున్నది. అజిత్ నటంచిన విశ్వాసం చిత్రం కూడా ఎక్కువ భాగం హైదరాబాద్ లో జరిగింది. ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో నటించి మెప్పించిన విద్యాబాలన్, అజిత్ నటించనున్న పింక్ రీమేక్ లో ఓ కీలక పాత్రలో ఆమె నటించనున్నది. పింక్ తమిళ రీమేక్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ నిర్మించనున్నాడు. యువన్ శంకర్ రాజా స్వరాలూ అందించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. అజిత్ ఈ చిత్రంలో మరో డిఫరెంట్ యాంగిల్ లో కనిపించనున్నాడు. ఆల్రెడీ విశ్వాసం సినిమాలో తన లుక్ కు ప్రేక్షకులనుండి మంచి ఆధరణ లభించింది. తమిళ పింక్ రీమేక్ మే1 న విడుదలవుతుంది.