సంక్రాంతి బరిలో అజిత్ విశ్వాసం

Ajith Viswasam Will Release On Pongal 2019

ఈసారి సంక్రాంతికి పెద్ద పోటీనే ఉండబోతుంది. తెలుగు సినిమాలు ఎన్టీఆర్, వినయ విధేయ రామ, ఎఫ్2 లు సంక్రాంతి బరిలో దిగబోతుండగా, వీటితో పాటుగా తమిళ అనువాద సినిమాలైనా రజినీకాంత్ నటించిన పెట్టా, అజిత్ నటిస్తున్న విశ్వాసం సినిమాలు కూడా తెలుగు లో సందడి చేయడానికి రెడీ అయ్యాయి. అజిత్ నటించిన విశ్వాసం సినిమాపైన భారీ అంచనాలే నెలకొన్నాయి. ఒక నెల వ్యవధిలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2.0 మరియు పెట్టా సినిమాలు విడుదలవ్వబోతుండగా, అజిత్ నటించిన విశ్వాసం సినిమా కూడా సంక్రాంతి కి విడుదలచేయాలని అజిత్ అభిమానులు కోరడంతో సంక్రాంతి పోటీలో నిలబడింది. వీటికి తోడు తమిళంలో శింబు నటించిన వందా రాజావాదాన్‌ వరువేన్‌, ఆర్జే బాలాజీ హీరోగా నటిస్తున్న పొలిటికల్ సెటైర్ చిత్రం ఎల్కేజీ సినిమాలు కూడా రజినీకాంత్, అజిత్ సినిమాలతో పోటీకి దిగాయి.

Ajith-Viswasam-Will-Release

అజిత్ నటిస్తున్న విశ్వాసం సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో అజిత్ రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు శివ కి ఇది అజిత్ తో వరుసగా చేస్తున్న నాలుగో సినిమా. అజిత్ – శివ కాంబినేషన్లో ఇప్పటికే వరుసగా వీరం, వేదాళం, వివేగం అనే మూడు విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈ అజిత్ సినిమాలలో వీరం సినిమాని పవన్ కళ్యాణ్ తెలుగులో కాటమ రాయుడు గా రీమేక్ చేయగా, వివేగం మాత్రం తెలుగులో వివేకం గా అనువాదం అయ్యి మంచి విజయాన్ని సాధించింది. వేదాళం సినిమాని కూడా పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తాడని వార్తలు వచ్చినప్పటికీ ఇంతవరకూ ఈ విషయం గురించి మరో వార్త రాలేదు. అజిత్ నటిస్తున్న విశ్వాసం సినిమా అదే పేరుతో సంక్రాంతి కి తెలుగులో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో అజిత్ సరసన నయనతార నటిస్తుండగా, సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తుంది.