స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అనిఖా సురేంద్రన్..

actress anikha
Anikha

అజిత్ నటించిన విశ్వసం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సిన్నది అనిఖా సురేంద్రన్ ఎంతవాడు కానీ సినిమాల్లోకూడా నటించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత తమిళ్‌లో కొన్ని సినిమాల్లో నటించింది. ఇవే కాకుండా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుట్టబొమ్మ అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అనిఖా సురేంద్రన్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. హీరోయిన్ గా అనిఖా సురేంద్రన్ తన నటనతో ఆకట్టుకుంది. దాంతో ఈ అమ్మడికి ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం.తెలుగులోనూ ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ అందుకుందని సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది.అనిఖా సురేంద్రన్‌ అందుకున్న బంపర్ ఆఫర్ ఏ హీరో సినిమాలోనో తెలుసా..అనిఖా సురేంద్రన్‌కు ధనుష్ సినిమా నుంచి ఛాన్స్ వచ్చిందట. ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధనుష్ నటిస్తున్న 50 వ చిత్రంలో అనిఖా సురేంద్రన్‌కు మెయిన్ లీడ్ రోల్ ఛాన్స్ వాచినట్టు టాక్ వినిపిస్తుంది. . రీసెంట్ గా ఈ సినిమా గురించి అనౌన్స్ చేశారు. ఈ సినిమా కు ధనుష్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాదు ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం గా ఉంటుందని అంటున్నారు.ధనుష్ రీసెంట్ గా సార్ సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు ధనుష్. ఈ సినిమాకూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని తెలుస్తోంది