శివుడు ఇచ్చిన బహుమతి అంటూ కొడుకు పుట్టిన రోజు మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

tollywood actor manchu manoj
Manchu Manoj

మంచు మనోజ్ ఇటీవల భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. మౌనికకు కూడా ఇది రెండో వివాహం. మొదటి భర్తతో ఒక అబ్బాయి సంతానంగా ఉన్నాడు. పిల్లాడి పేరు ధైరవ్ నాగి రెడ్డి. పెళ్లి అవ్వగానే ధైరవ్ ని తన కొడుకుగా మనోజ్ స్వీకరించాడు. తనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప బహుమతిగా ధైరవ్ ని అభివర్ణించాడు. మౌనికతో పెళ్లయ్యాక ధైరవ్ మొదటి పుట్టినరోజు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు.

ఈ సందర్భంగా మనోజ్ ఒక నోట్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. ఈ ప్రత్యేకమైన రోజున గాడ్ శివ ధైరవ్ నాగిరెడ్డి రూపంలో వెలకట్టలేని నిధినినాకు బహుమతిగా ఇచ్చాడు. ధైరవ్ రాక మా జీవితాలల్లో చేయబోతున్న ప్రయాణానికి ఒక కొత్త నాంది అని . ఈ ప్రయాణంలో ప్రతిరోజును నేను ఆస్వాదిస్తున్నాను. నీ నవ్వులు, అమాయకత్వం, ప్రేమ నన్ను నడిపించే కాంతులు. మరియు అమ్మ మౌనిక నువ్వు న జీవితాన్ని అందంగా మార్చారు అని రాసుకొచ్చాడు.

మనోజ్ కి ధైరవ్ మీద ఉన్న ప్రేమ ఆ పోస్ట్ లో కనిపిస్తుంది. భూమా మౌనిక , మనోజ్ కుటుంబల మధ్య చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. మౌనిక వివాహానికి మనోజ్ హాజరయ్యారు. అనంతరం మనోజ్, మౌనికలు తమ భాగస్వాములతో విడాకులు అయ్యాయి. అప్పుడు వీరిద్దరూ దగ్గరయ్యారు. మౌనికను దక్కించుకోవడానికి చాలా కష్టపడ్డట్లు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర పాటు చెన్నైలో రహస్యంగా ఉన్నారట. కాగా మౌనికతో వివాహానికి మోహన్ బాబు ఒప్పుకోలేదనే ప్రచారం జరిగింది. దీనికి క్లారిటీ ఇస్తూ మనోజ్, నాన్నకు మౌనిక గురించి చెప్పినప్పుడు బాగా ఆలోచించావా అన్నాడు. ఆమె నన్నే నమ్ముకుంది. తనకు జీవితం ఇవ్వకపోతే బ్రతికి వేస్ట్ అని చెప్పినట్లు మనోజ్ చెప్పుకొచ్చాడు. మనోజ్-మౌనిక పెళ్ళికి విష్ణు దూరంగా ఉన్నాడు. మోహన్ బాబు కూడా చివరి నిమిషంలో హాజరయ్యారు. మంచు లక్ష్మి తమ్ముడు పెళ్లి బాధ్యత నెరవేర్చింది.