శ్రీ లీలా సీనియర్ హీరోలకి అవకాశం ఇచ్చే రేంజ్ కి వెళ్లిందంటే కారణం ..

Actress SreeLeela
SreeLeela

గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీగా పాపులారిటీ దక్కించుకొని ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్స్ శ్రీ లీల ఒకటే అనే చెప్పాలి. ఎంతోమంది కుర్ర హీరోలకి కాదు సీనియర్ హీరోలకి కూడా ఏకైక ఆప్షన్ అన్నట్టుగా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అది తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీ దక్కించుకున్న ఈమె స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు నటించి విడుదల చేసింది రెండు సినిమాలే అయినా భారీగా పాపులారిటీ దక్కించుకున్న ఈమె చేతిలో ఇంకా పదికి పైగా సినిమాలు ఉండడం గమనార్హంఒకదానికి మించి మరొకటి సినిమాలలో ఈమెకు అవకాశాలు లభిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా సీనియర్ స్టార్ హీరోల సినిమాలే ఉండడం గమనార్హం.
బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం భగవంత్ కేసరి ఈ సినిమాలో శ్రీలీలా నటిస్తుండగా ఈ సినిమా ఈ దసరా కానుకగా అభిమానులని అలరించనుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఓ జి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతోంది.
సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ మొత్తాన్ని కవర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరోపక్క యంగ్ హీరోస్ కంటే సీనియర్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇలా సీనియర్ హీరోలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఆ హీరోలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా ఉంటుందని , ఎలాంటి సినిమా తీసినా హిట్టు కొట్టించడానికి ఫ్యాన్స్ ఉంటారని అలా తన ఖాతాలో కూడా హిట్లు పడతాయని ఇదే మెయిన్ రీజన్ గా ఆమె ఎక్కువగా సీనియర్ హీరోలకు అవకాశాలు ఇస్తుందని సమాచారం.ఇదంతా పక్కన పెడితే ఈ అమ్మడు ఈమె సినిమా డేట్స్ అండ్ సినిమాల ఎంపిక ప్లాన్ నిజంగా అద్భుతం అని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.