విశ్వాసం షార్ట్ రివ్యూ…!

Viswasam Movie Review

తమిళంలో తల అజిత్ నటించిన చిత్రం విశ్వాసం. ఈ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలైన మొదటి రోజు పాజిటివ్ టాక్ దక్కించుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వుతుంది. ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార కథానాయకగా నటిస్తుంది. ఈ చిత్రంలో అజిత్ ఇంట్రడక్షన్ సిన్ అండ్ డైలాగ్ డెలివరీ, అజిత్ గెట్ అప్,ఇవ్వని ప్లస్ పాయింట్స్ అంటున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫ్యామిలీ అండ్ కామెడీ తో చక్కగా నడిపించాడు దర్శకుడు శివ. అలాగే ఈ చిత్రంలో ఇంటర్వెల్ ఫైట్ కు ముందు వచ్చే ఫైట్ సిన్ కుడా ఆకట్టుకునే విధంగా ఉన్నదంట.

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం క్లైమాక్స్ అండ్, ప్రతినాయకుడి పాత్రలో నటించిన జగపతి బాబు మైనస్ పాయింట్స్ అంటున్నారు. మరొక్కటి స్క్రీన్ ప్లే కూడా మైనస్ అంటున్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రం చూసే విధంగా ఉన్నదంట. తల అజిత్ ఫాన్స్ విశ్వాసం పాజిటివ్ టాక్ తో పండగ ముందే వచ్చేసిందని ఆనంద పడుతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమా ఈ రోజు విడుదలవుతుంది. పేట సినిమా కానీ టాక్ కొంచెం అటుఇటుగా ఉన్నా విశ్వాసం చిత్రంకు అక్కడ తిరుగు ఉండదు. విశ్వాసం చిత్రం తెలుగులో ఈ నెల 25న విడుదలవుతుంది. అందుకు సంబందించిన డబ్బింగ్ పనులు కూడా చక చక జరుగుతున్నాయి. మరి తెలుగులో ఈ చిత్రం ఏలాంటి విజయం సాదిస్తుందో చూడాలి మరి.