అర్జున్ రెడ్డి ఎం‌ఎల్‌ఏ కాంబో…!

Vijay Devarakonda To Team Up With Kranthi Madhav

ఆర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ మంచి నటుడుగా గుర్తింపు సంపాదించుకున్నాడు. గీత గోవిందం సినిమా విజయంతో టాలీవుడ్ స్టార్ హీరో జాబితాలో చేరిపోయాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ఓ నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో తాజాగా అయన భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది. ఈ నేపద్యంలోనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు రంగం సిద్దం చేస్తున్నాడు. ఇంతకు ముందు ఈ డైరక్టర్ ఓనమాలు, మళ్ళి మళ్ళి ఇది రానిరోజు చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలు దక్కించుకున్నాడు. విజయ్, క్రాంతి మాధవ్ తో సినిమాకు సిద్దం అవ్వుతున్నాడు.

ఈ చిత్రం ఫిబ్రవరి లో సెట్స్ పైకి వెళ్ళుతుంది. ఇంకా విజయ్ సరసన హీరొయిన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. చివరికి విజయ్ సరసన నటించేందుకు క్యాథరిన్ ను ఎంపిక చేశారు. ఆల్రెడీ క్యాథరిన్ సినిమాలో గ్లామర్ పాత్రలో నటిస్తుంది. ఇప్పటివరకు హీరొయిన్ గా మాత్రం అవకాశాలు రాలేదు. నినే రాజు నేనే మంత్రి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ సినిమాలో కథానాయకగా అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంలో క్యాథరిన్ పాత్రకు మంచి రెస్పాన్సు వస్తుందంటున్నారు. క్రాంతి మాధవ్ సినిమా తరువాత మరో రెండు ప్రాజెక్ట్స్ తో రెడీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ నిర్మాతగా బాలీవుడ్ లో కూడా ఓ సినిమాలో నటిస్తాడని, జాన్వి కపూర్ కథానాయకగా నటిస్తుందని సోషల్ మీడియాలో బాగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే విజయ్ బాలీవుడ్ లోకి ఎంట్రి ఇవ్వనున్నాడు.