“ది ఫ్యామిలీ స్టార్” ని డామినేట్ చేస్తున్న “టిల్లు స్క్వేర్”

"Tillu Square" Dominating "The Family Star"

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మరియు మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ది ఫ్యామిలీ స్టార్ (The Family star) థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. మూవీ పై మంచి హైప్ ఉన్నప్పటికీ చాలా మంది ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయితే స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ (Tillu square) రెండవ వారంలో బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి ప్రదర్శన కనబరుస్తుంది .

"Tillu Square" Dominating "The Family Star"
“Tillu Square” Dominating “The Family Star”

ఇటీవలే 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ తో ప్రేక్షకులని థియేటర్లకు రప్పిస్తూనే ఉంది. ముఖ్యంగా చెప్పుకోద‌గ్గ విష‌యం ఏంటంటే, టికెట్ల అమ్మ‌కాల విష‌యంలో టిల్లు స్క్వేర్ ది ఫ్యామిలీ స్టార్ ని డామినేట్ చేస్తోంది. ఈ ఆదివారం, టిల్లు స్క్వేర్‌ మూవీ కు 71 వేల కి పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అయితే ది ఫ్యామిలీ స్టార్ కేవలం 55 వేల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడవడంతో వెనుకబడి ఉంది. టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకు పోతుంది .