“వినయ విధేయ రామ” ప్రివ్యూ…!

Ram Charan Vinaya Vidheya Rama Movie Preview

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్షన్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో భరత్ అనే నేను మూవీ ఫేమ్ కియార అద్వాని కథానాయకగా నటిస్తుంది. కోలీవుడ్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం రేపు భారీ అంచనాల నడుమ రేపు విడుదలవుతుంది. విడుదలకు ముందే ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్ నైజాం ఏరియాలో సృష్టించింది. నైజాం రైట్స్ 24 కోట్లు గా అమ్ముడు పోయిందని సమాచారం. ఇకా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం టివి చానల్స్ మద్య గట్టిపోటి నెలకొన్నదంట. ఈ చిత్రా నిర్మాత హింది శాటిలైట్ రైట్స్ ను 25 కోట్లకు డిమాండ్ చెయ్యగా ఓ హింది బడా నిర్మాత 22కోట్లకు దక్కించుకున్నాడని సమాచారం. ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ కూడా భారీ మొత్తంలో అమ్ముడు పోయినట్లుగా సమాచారం.

వినయ విధేయ రామ చిత్రం విడుదలకు ముందే ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడికి రెండింతలు వసూళ్ళు చేస్తుందని సమాచారం. రామ్ చరణ్ రంగస్థలం చిత్రం తరువాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మొత్తంలో ఈ సినిమాకు ధర పలుకుతుందని అంటున్నారు. హై వోల్టైజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి తెరకెక్కించాడు. ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కి అండ్ టిజర్ కు మంచి రెస్పాన్సు రావడంతో సినిమా అంచనాలు పెరిగాయి. ఈ మద్య విడుదలైన ట్రైలర్ కుడా పాజిటివ్ టాక్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అజార్ బైజాన్ లో తీసిన యాక్షన్ ఎపిసోడ్ హై లైట్ గా నిలుస్తుంది అంటున్నారు. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు చరణ్ కు అన్నలు గా నటిస్తుండటంతో వాళ్ల చుట్టే కథ నడుస్తుందని సమాచారం. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడు పాత్రలో కనిపిస్తాడు. చరణ్ కు, వివేక్ మద్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఈ చిత్రానికే హై లైట్ అవుతుందంటున్నారు. కియర అద్వాని, చరణ్ రొమాన్స్ కూడా సినిమాకు చాలా ప్లస్ పాయింట్స్ అవ్వుతాయి. ఇప్పటికే వినయ విధేయ రామ చిత్రం నుండి విడుదలైన పాటలు రికార్డ్స్ ను సృష్టిస్తున్నాయి.