మరల సినిమాలు నిర్మిస్తా…!

Actor Aryan Rajesh Is Happy To Make A Comeback With Vineya Vidheya Rama

ఈవీవీ సత్యనారాయణ పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ “హాయ్” అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో మంచిగానే ఆకట్టుకున్నా ఆ తరువాత అయన నటించిన సినిమాలు పరాజయం పాలు కావడంతో ఆర్యన్ రాజేష్ హీరోగా ఎదగలేకపోయాడు. ఆర్యన్ రాజేష్ తన తండ్రి స్థాపించిన ఈవివీ బ్యానర్ లో సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తాజా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… కెరీర్ ఆరంభంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. అందువలన నేను సినిమా రంగంలో రానించలేకపోయాను. నేను నటించిన చాలా సినిమాలు నేను మొహమాటానికి పోయి ఒప్పుకున్నా సినిమాలు చాలానే ఉన్నాయి అందువలన నా కెరీర్ గాడి తప్పింది. ఇప్పుడు అలాంటి వాటికీ నేను చోటు ఇవ్వను అన్నారు. అదే విధంగా నాన్న గారు ఎంతో మంది నిర్మాతలకు లైఫ్ ఇచ్చారు.

ఇప్పుడు ఒక్కరు కుడా నాతో సినిమాలు తియ్యడానికి ముందుకు రావడంలేదు. వాళ్ల ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఓ మామలు హీరోతో సినిమాలు తీసి డబ్బులు పెట్టలేరు కాబట్టి వాళ్ల ఆలోచన కూడా కరెక్ట్ గానే ఉంటుందన్నారు. అందుకే హీరోగా నిర్మాతగా నా బ్యానర్ లోనే సినిమాలు తీసుకుంటాను అన్నారు. అందుకు సంబందించిన పనులు కూడా మొదలు పెట్టాను. రీ ఎంట్రీ గా ఓ కొత్త సినిమాతో వచ్చేందుకు ప్లాన్ చేస్తాను నాన్న గారు స్థాపించిన బ్యానర్ నుండి ప్రేక్షకులు ఎటువంటి సినిమాలు ప్రేక్షకులు ఆశిస్తారో అలాంటి సినిమాలు తప్పకుండా అందిస్తాను. ముఖ్యంగా కొత్త దర్శకులకు నా బ్యానర్ నుండి అవకాశాలు ఇస్తాను అన్నారు. ఆర్యన్ రాజేష్ ప్రస్తుతం బోయపాటి సినిమా వినయ విధేయ రామ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం రేపు విడుదలవుతుంది.