మోడీ బతిమలాడితే పీఎంని చేశాడట …!

KA Paul Interesting Comments On PM Modi And LK Advani

కేఏ పాల్ ఈ పేరు తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. అది కూడా పిచ్చి మాటలకు. ఆయన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ని గెలిపించింది నేనే అంటాడు, పెద్ద పెద్ద పొలిటిషీయన్స్ తన సపోర్ట్ కోరుతున్నారంటారు. ఇలా ఎవరి ఊహలకు అందని విషయాలు ఎన్నెన్నో చెప్తుంటారు. ఆ మాటలు విని జనం నవ్వుతున్నారని తెల్సినా ఆయన మాత్రం అలా మాట్లాడటం మానరు. తాజాగా ఆయన మోడీ, ఎల్ కే అద్వానీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రఈరోజు మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ 2014లో తాను మద్దతు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు. మోడీయే తన వద్దకు వచ్చి అడగడం, సెక్యులరిజం అని చెప్పడంతో ప్రచారం చేశానని అన్నారు.

‘మీరు బీసీ, నేను బీసీ. నాకు ఫ్యామిలీ లేదు. మీకూ ఫ్యామిలీ లేదు. దేశమే మన ఫ్యామిలీ. ఇద్దరం కలిసి దేశాన్ని అభివృద్ధి చేద్దామని గంటా నలభైఐదు నిమిషాలపాటు నాతో చర్చించారని అన్నారు. బీజేపీ ప్రెసిడెంట్లు, సెక్రెటరీలు ఇలా అందరినీ అమెరికా పంపించి రిక్వెస్ట్ చేసి, ఇది చేసి, అది చేసి ఎంతగా నన్ను వేడుకున్నారంటే ఒక చిన్న కుర్రాడిలా మోదీ బిహేవ్ చేశారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ‘2013 అక్టోబర్ 1న చేతులు జోడించి గంటన్నరపాటు చెప్పారు. మోదీకి సపోర్ట్ చేయొద్దు. అతను ఒక్క హామీని కూడా నెరవేర్చడని చెప్పారు. ఆయనే తన ఇంటికి డిన్నర్‌కు పిలిచి ఈ విషయం చెప్పారు. నేను మోదీగారి ఇంటికి వెళ్లలేదు. ఆయనే నా దగ్గరికి వచ్చారు. కానీ అద్వానీ గారి ఇంటికి వెళ్లానని కేఏ పాల్ చెప్పుకొచ్చాడు.