“ఎన్టీఆర్ కథానాయకుడు” 1వ రోజు కలక్షన్స్…!

NTR Kathanayakudu Movie First Day Collection

బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ జీవితాని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాని రూపొందించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా, విద్యాబాలన్, బసవతారకం పాత్రలో నటిస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు నిన్న విడుదలై పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. మొదటి రోజు యూఎస్ఏ లో మంచి ఒప్పెనింగ్స్ ను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం 7.61 కోట్ల షేర్ ను రాబట్టింది. పండగ సీజన్ కావడంతో ఇంకో వారం రోజులు పాటు సినిమా రికార్డ్స్ స్థాయిలో వసూళ్లను రాబడుతుంది అంటున్నారు. కాకపోతే ఇంకో రెండు రోజులో వినయ విధేయ రామ, ఎఫ్2 చిత్రాలనుండి పోటి ఎదురుకానున్నది. ఈ రెండు చిత్రలుకుడా డిఫరెంట్ జోనర్ల్ కు చెందినవి కావునా ఎన్టీఆర్ కథానాయకుడి పైన ప్రభావం చూపకపోవచ్చు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇంకా రెండోవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7 న విడుదలవుతుంది.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలో ఎన్టీఆర్ కథానాయకుడు సాదించిన కలెక్షన్స్ వివరాలు:
నైజాం 1.72 కోట్లు
సీడెడ్ 80లక్షలు
నెల్లూరు 52లక్షలు
గుంటూరు 2.04 కోట్లు
కృష్ణా 74,30,211
పశ్చిమ గోదావరి 68లక్షలు
తూర్పు గోదావరి 41,06,116 లక్షలు
ఉత్తరాంధ్ర 69,78,554 లక్షలు
ఏపీ, తెలంగాణ లో మొదటి రోజు షేర్ : 7. 61 కోట్లు