దుమ్ముదులుపుతున్న సర్కార్ ట్రైలర్ !

Sarkar-Official-Teaserఇల‌య‌తళ‌ప‌తి విజ‌య్, స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తుపాకి, క‌త్తి సినిమాలు సంచ‌ల‌న విజ‌యం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో స‌ర్కార్ చిత్రం రూపొందుతుంది. న‌వంబ‌ర్ 6న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర త‌మిళ టీజ‌ర్ ద‌స‌రా కానుక‌గా విడుద‌లై రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించింది. తాజాగా తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ వాయిస్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో ‘వాడొక కార్పోరేట్ రాక్షసుడు ఏ దేశానికి వెళ్లినా వాళ్లని నాశనం చేసే వెళ్తాడు వాడు ఇప్పుడు ఇండియా వచ్చాడు’ అంటూ విజయ్ ఇంట్రడక్షన్ ఇస్తుంది.

vijay

అలాగే ‘నేను ఏ కంపెనీని కొనడానికి రాలేదు. ఈ రోజు ఎలక్షన్ డే కదా నేను నా ఓటు వేయడానికి వచ్చాను’ అంటూ వేలు చూపించడం .. ‘ఇంకా ఒక్కరోజులో ఏం మారుతోందో.. మారబోతోందో ఓ మూలన కూర్చొని వేడుక చూడండి.. నేనో కార్పోరేట్ క్రిమినల్‌ని ’, ‘మీ ఊరి నాయకుడ్ని మీరే కనిపెట్టండి ఇదే మన ‘సర్కార్’ లాంటి పొలిటికల్ పంచ్‌లు అభిమానుల‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్నాయి. విజ‌య్ 62వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలోన‌టించింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించాడు. మొత్తం అంతా క్రేజీ కాంబినేషన్ లు కావడంతో సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.