గాలి కోటకి బీటలు…!

Bellary-Congress-By-Electio

కాంగ్రెస్, జేడీఎస్ కూటమి మధ్య ఉన్న స్నేహాన్ని దెబ్బకొట్టాలని ఒక పక్క ఏపీలో రానని ఉప ఎన్నికలను అవసరం లేకపోయినా కర్ణాటకలో నిర్వహిస్తున్న బీజేపీకి రివర్స్‌లో షాకులు తగులుగుతున్నాయి. అధికారం తమకే ఉండడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ గాలి బ్రదర్స్ ను వారి కంచుకోట లాంటి బళ్ళారిని కూల్చేందుకు సిద్ధమయింది. గాలి జనార్ధన్ రెడ్డితో తీవ్రమైన వైరమున్న డీకే శివకుమార్ ను.. బళ్లారికి ఇన్చార్జ్ గా నియమించారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా శ్రీరాములుసోదరి బరిలో ఉన్నారు. శ్రీరాములు ఆరు నెలల పదవి కాలం ఉన్న ఎంపీ పదవిని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖర్చు పెడుతున్నారు. ఈ ఎన్నికల ఫ లితం.. .వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుంది కాబట్టి.. ఖర్చుకు శ్రీరాములు వెనుకాడటం లేదు.
అయితే లోక్ సభ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ నాయకులు కుట్రలు చేయడానికి సైతం వెనకాడరని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాంధించడానికి బీజేపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానని సిద్దరామయ్య గుర్తు చేశారు. ఆ సందర్బంలో తాను బెంగళూరు నుంచి బళ్లారికి పాదయాత్రగా వచ్చానని, ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి సోదరులు గూండాలతో తమను బెదిరించారని సిద్దరామయ్య ఆరోపిస్తున్నారు.

dk-shiva-and-janardhnareddy
సండూరులో తాను బహిరంగ సమావేశం నిర్వహించడానికి గాలి జనార్దన్ రెడ్డి సోదరులు అవకాశం ఇవ్వలేదని, కనీసం స్థలం కూడా ఇవ్వకుండా గూండాలతో బెదిరించారని, వారి దెబ్బకు పోలీసులు సైతం పరుగు తీసి చేతులు ఎత్తి వేశారని సిద్దరామయ్య ఆరోపించారు. అయితే ఒకానొక సమయంలో తాము బెదరకొట్టి పంపిన మనిషి ఇప్పుడిలా మాట్లాడడం చూసి తమ కంచుకోటను ఎక్కడ స్వాధీనం చేసుకుంటుందో అన్న భయంతో గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. అందుకే తాను నేరుగా రంగంలోకి దిగుతానంటూ బీజేపీ పెద్దలకు రాయబారాలు నెరపుతున్నారట. కానీ కేసుల నేపథ్యంలో బళ్లారిలో ప్రవేశించేందుకు ఆయనకు అనుమతి లేదు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో తన సన్నిహితుడు శ్రీరాములు సోదరి తరఫున ప్రచారానికి ఆయన ఆసక్తి చూపించారు. కానీ ఇప్పటికే సీబీఐ సహా చాలా చోట్ల అవినీతి వ్యవహరాల్లో బీజేపీ పేరు నాశనం అవుతున్న తరుణంలో బీజేపీ ఇప్పటి వరకూ స్పందించలేదు. దీంతో ఒక రకంగా ఏకచత్రాదిపత్యం ఏలిన గాలి కోట పటాపంచలు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

jardhanareddy