24 కిస్సెస్ ట్రైలర్ హెబ్బా పటేల్ ముద్దులతో ముంచెత్తింది

24 kisses movie

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టెనర్ ’24 కిస్సెస్’. మిణుగురులు’ చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ వారం (అక్టోబర్ 26) విడుదలవ్వాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలతో సినిమా విడుదలను వాయిదా వేశారు. లిప్ లాక్ లు అధికంగా ఉండ‌టంతో ఈ మూవీకి ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సెన్సార్ పూర్తి కావ‌డంతో ఈ మూవీని న‌వంబ‌ర్ 15వ తేదిన విడుద‌ల చేయ‌నున్నారు.

24 కిస్సెస్ ట్రైలర్ హెబ్బా పటేల్ ముద్దులతో ముంచెత్తింది - Telugu Bullet

ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నఈ మూవీని తొలి సినిమాతోనే ప్రశంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు అయోధ్య కుమార్ తెర‌కెక్కించాడు.. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర మొదటి ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. బోల్డ్ కంటెంట్ కు తోడు అద్భుత‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాడు ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్. హెబ్బా, ఆదిత్ మ‌ధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. అలాగే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌క‌ల‌ను ఈ చిత్రం క‌చ్చితంగా అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. రావు ర‌మేష్, న‌రేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ఈ మూవీ రెండో ట్రైల‌ర్ ను కొద్ది సేపటి క్రితం విడుద‌ల చేశారు. మీరూ ఒక లుక్ వేసెయ్యండి మరి.