హెబ్బా పటేల్ 24 కిస్సెస్ ట్రైలర్ : 24 లెక్క సరిపోయింది

24 kisses trailer

“కుమారి 21 ఎఫ్” అనే సినిమాతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన హెబ్బా ఒక్క సినిమాతోనే మాయ‌మైపోతుంద‌ని ఊహించ‌లేదు ఎవ‌రూ. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి విజ‌యాలు ఉన్నా వాటిల్లో ఆమెది మైనర్ రోల్స్ కాబట్టి హెబ్బాను ద‌ర్శ‌క నిర్మాత‌లు కేర్ చేయలేదు. తాజాగా ఇప్పుడు ఈమె న‌టిస్తున్న “24 కిస్సెస్” ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత కుమారి మళ్ళీ ఫాం లోకి వచ్చేసిందనిపించ‌క మాన‌దు. ఎందుకంటే అమ్మ‌డు చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ రెచ్చిపోయింది. ముద్దుల మీద ముద్దులు పెట్టేసింది.

24-kisses

ఒక‌టి రెండు కాదు ఏకంగా టైటిల్ లెక్క‌కు త‌గ్గ‌ట్లు 24 ముద్దుల‌తో హీరోని ముంచెత్తింది అని టాక్. హ్యాపీగా సాగిపోతున్న ప్లే బాయ్ జీవితంలోకి సిన్సియ‌ర్ గా ప్రేమించే ఓ అమ్మాయి రావ‌డం తెలియ‌కుండానే అబ్బాయి కూడా అమ్మాయితో ప్రేమ‌లో ప‌డిపోవ‌డమే “24 కిస్సెస్” క‌థ‌. రావు రమేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని “మిణుగురులు” సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అయోధ్య కృష్ణంశెట్టి తొలి సినిమాకు పూర్తి భిన్నకోణమైన రెండో సినిమా చేసాడు.

24-kisses

ట్రైల‌ర్ చివ‌ర్లో అద్వైతాన్నైనా అర్థం చేసుకోవచ్చు కానీ ఆడదాన్ని అర్థం చేసుకోలేం.. అని ఎస్వీఆర్ గారు అన్నార్రా అంటూ రావు ర‌మేష్ చెప్పిన డైలాగ్ అదుర్స్. సినిమా సెప్టెంబ‌ర్ 13న వినాయ‌క‌చవితి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. అదే రోజు మరో రెండు భారీ సినిమాలు ఉన్నా వినాయక చవితి సెలవలు కలిసొస్తాయని ఆరోజే విడుదల ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ముందైతే ట్రైలర్ చుసేయ్యండి.