చైతన్య, సమంతల వార్‌ తప్పేలా లేదు…!

Naga Chaitanya Samantha Movie Release War

అక్కినేని నాగచైతన్య, సమంతల మద్య బాక్సాఫీస్‌ వార్‌ తప్పేలా లేదు. వీరిద్దరు భార్య భర్తలు అయిన తర్వాత మొదటి సారి వేరు వేరు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు ఒకే సమయంలో రాబోతున్నారు. నాగచైతన్య నటించిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ మరియు సమంత నటించిన ‘యూటర్న్‌’ చిత్రాలు వినాయక చవితి శుభాకాంక్షలతో వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మొదట శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయాలని అనుకున్నారు. కాని రీ రికార్డింగ్‌ వర్క్‌ పూర్తి కాని కారణంగా సినిమాను వాయిదా వేయడం జరిగింది. తాజాగా శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని సెప్టెంబర్‌ 13 లేదా 14న విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.

samantha-nagchaitanya

యూటర్న్‌ చిత్రాన్ని నెల రోజుల క్రితమే సెప్టెంబర్‌ 13న వినాయక చవితి శుభాకాంక్షలతో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి సమయంలో శైలజ రెడ్డి అల్లుడు కూడా విడుదల కావడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు ఖచ్చితంగా పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంటుంది. అలాంటి సమయంలో సమంత యూటర్న్‌ చిత్రం కలెక్షన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో యూటర్న్‌ నిర్మాతలు మరియు బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌ 13 తప్పితే శైలజ రెడ్డి అల్లుడికి సరైన సమయం లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల చేయాల్సి వస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ భార్య భర్తల మద్య బాక్సాఫీస్‌ వార్‌ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

samatha1