త్రిష 96 ట్రైలర్…స్కూల్ లో ప్రేమాయణం

96 Trailer

విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్ లో ప్రేమ్ కుమార్ దర్సకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 96. త్రిష 59వ చిత్రంగా వస్తోన్న 96 మూవీ మీద భారీ ఎక్స్ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం ఈ చిత్రం 1996వ సంవత్సరంలో జరిగిన కొన్నియదార్ధ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందనే టాక్ జనాల్లోకి రావడమే.

96-movie

ఈ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రంలో త్రిష స్కూల్ టీచర్ పాత్ర చేస్తుందని చెబుతున్నారు. సెప్టెంబర్ 13న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ అభిమానులని అలరిస్తుంది. విజయ్ సేతుపతి, త్రిషల చిన్నతనం సీన్స్ తో పాటు వారు ఎదిగిన తర్వాత ఇద్దరు ఒక్కటిగా ఎలా అయ్యారు అనేది ట్రైలర్ లో చూపించారు. మీరూ ఒక లుక్ వేసెయ్యండి మరి