దిల్‌ రాజు ‘96’ రీమేక్‌పై పునరాలోచన

Dil Raju Could Not Find Actors For 96 Remake

తమిళనాట గత నెలలో విడుదలైన ‘96’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. విజయ్‌ సేతుపతి మరియు త్రిష జంటగా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ సంచలన విజయాన్ని సాధించి రికార్డులు బ్రేక్‌ చేసింది. సినిమా టీవీలో ప్రసారం అయిన తర్వాత కూడా ఇంకా థియేటర్లలో హౌస్‌ ఫుల్‌ అవ్వడం ఈ చిత్రానికే చెల్లింది. విజయ్‌ సేతుపతి అద్బుతమైన నటన మరియు త్రిష కెరీర్‌ బెస్ట్‌ ఔట్‌ పుట్‌ ఇవ్వడం వంటి కారణాల వల్ల సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని మొదట తెలుగులో డబ్‌ చేయాలని భావించారు. డబ్బింగ్‌ పనులు కూడా మొదలు పెట్టారు. అలాంటి సమయంలో ఇంత మంచి సినిమాను డబ్‌ చేయడం కంటే రీమేక్‌ చేస్తే మంచి ఫలితం వస్తుందని దిల్‌రాజు భావించాడు.

96-movie-remake

భారీ మొత్తం పెట్టి ‘96’ రీమేక్‌ రైట్స్‌ను కొనుగోలు చేయడం జరిగింది. అల్లు అర్జున్‌, నానిలతో పాటు ఇంకా కొందరికి ఈ చిత్రం చూపించాడట. రీమేక్‌ లో నటించాలంటూ కోరాడట. అందరి మాట ఒక్కటే. విజయ్‌ సేతుపతి స్థాయిలో నటించడం అసాధ్యం. ఇలాంటి అద్బుతాలు ఎప్పుడు కూడా ఆవిష్కారం కావు. అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయని హీరోలు తమ వల్ల కాదు అంటున్నారట. సినిమాలో నటించిన లీడ్‌ పెయిర్‌ విజయ్‌ సేతుపతి మరియు త్రిషలతో పాటు ఇతర నటీనటులు అంతా కూడా అద్బుతమైన నటనను కనబర్చడం వల్లే సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందని, మళ్లీ అంతటి నటన తెలుగు రీమేక్‌ లో రావడం అసాధ్యం అవ్వొచ్చు. అప్పుడు సినిమా మెప్పించక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. దాంతో దిల్‌రాజు కూడా ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. రీమేక్‌ ఆలోచన పక్కన పెట్టి డబ్‌ చేసి విడుదల చేయాలని దిల్‌ రాజు భావిస్తున్నాడట.

96-movie