తనీష్‌ మూవీకి న్యాయపరమైన అడ్డంకులు

Tanish Rangu Movie Controversy

తనీష్‌ హీరోగా తెరకెక్కిన ‘రంగు’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. హీరోగా ఇప్పటి వరకు ఒక్కటైనా కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయిన తనీష్‌ ఈ చిత్రంతో అయినా కాస్త సక్సెస్‌ను దక్కించుకుంటా అనుకున్నాడు. చాలా కాలం క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం తాజాగా తనీష్‌కు వచ్చిన బిగ్‌ బాస్‌ క్రేజ్‌ను ఉపయోగించుకుని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. తనీష్‌ ఈ చిత్రంలో విజయవాడ రౌడీ షీటర్‌ లారా పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం లారా బయోపిక్‌ అనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా ట్రైలర్‌ విడుదల తర్వాత ఆ విషయం తెలిసింది. లారా అనే రౌడీ షీటర్‌ అంటూ ట్రైలర్‌ మొదలైంది. దాంతో లారా బయోపిక్‌ అంటూ ప్రచారం మొదలైంది.

Tanish

లారా జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు సినిమాను మొదట తమకు చూపించాల్సిందిగా కోరుతున్నారు. లారా జీవితాన్ని సినిమాలో ఎలా చూపించారనే విషయం మాకు తెలియాలి. లారాపై అన్యాయంగా రౌడీ షీటర్‌ తెరవడం జరిగింది. సినిమాలో లారాను విలన్‌గా చూపిస్తే మాత్రం విజయవాడలో సినిమాను విడుదల కానివ్వమంటూ ఆయన వర్గీయులు ప్రకటించారు. ఈ సందర్బంగా తనీష్‌ స్పందిస్తూ.. తాను లారా పాత్రలో పోషించిన మాట నిజమే. అయితే లారా జీవితం గురించి చాలా బాగా చూపించాం. ప్రతి ఒక్కరు కంట తడి పెట్టుకునే విధంగా ఈ చిత్రంను దర్శకుడు తెరకెక్కించాడు. లారా సన్నిహితులు చూసినా కూడా ఈ సినిమాను తప్పకుండా అభినందిస్తారు అంటూ తనీష్‌ అన్నాడు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేస్తాం. తప్పకుండా అందరిని ఈ చిత్రం ఆకట్టుకుంటుందని తనీష్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి లారా సన్నిహితులు సినిమాపై న్యాయపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వివాదం ఎంద దూరం వెళ్తుందో చూడాలి.