నక్షత్రం ప్రివ్యూ.

nakshatram movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని చాటి చెప్పే ఉద్దేశంతో తీసిన సినిమా నక్షత్రం. హీరోలు సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ తో పాటు ప్రకాష్ రాజ్ తదితరులు కేవలం కృష్ణవంశీ చెప్పిన కధకు ఫ్లాట్ అయ్యి చేస్తున్న సినిమా ఇది. పోలీసులు అంటే భయమో, కోపమో మాత్రమే వున్న సమాజంలో నక్షత్రం చూసాక ఖాకీల మీద గౌరవం పెరిగేలా ఉంటుందని కృష్ణవంశీ అంటున్నారు.

సమాజంలో కుళ్ళుని భరించలేక దాన్ని సరిదిద్దాలనుకునే ఓ యువకుడు చేసిన అనూహ్య ప్రయత్నం, దాని పరిణామాలు ఎలా ఉంటాయన్న దాని చుట్టూ అల్లుకున్న కథ నక్షత్రం. ఓ క్రైమ్ థ్రిల్లర్ కధలో సామాజిక బాధ్యత ని ఇమిడ్చిన కృష్ణవంశీ నక్షత్రం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. పేరుకి దర్శకుడు అయినా అంతకు మించి బాధ్యత తీసుకుని చేసిన సినిమా ఇది. నక్షత్రం మీద కృష్ణవంశీతో భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పుకోవాలి. సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఇది.

మరిన్ని వార్తలు:

అసిస్టెంట్ ని కొట్టిన బాలయ్య … వైరల్ వీడియో

జోగేంద్ర యువ గర్జనలో బిత్తిరి సత్తి సందడి

మళ్ళీ రావా అంటున్న సుమంత్