‘ఫిదా’ వల్ల చైతూ మూవీ ఆగింది

nagachaitanya movie stopped due to fidaa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాగచైతన్య హీరోగా ‘యుద్దం శరణం’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. త్వరలోనే విడుదల కాబోతున్న ఆ సినిమా తర్వాత వెంటనే సౌజన్య దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఇప్పటికే సినిమాను ప్రారంభించాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. ప్రారంభోత్సవ డేట్‌ ప్రకటించాలని భావిస్తున్న సమయంలోనే ‘ఫిదా’ చిత్రం విడుదలైంది. ‘ఫిదా’ చిత్రం చూసిన తర్వాత సౌజన్య తన సినిమాను రద్దు చేసుకుంది. కారణం అదే కథ మరియు అదే కథనం అవ్వడంతో తన సినిమాను రద్దు చేసుకుని మరో ప్రయత్నంలో నిమగ్నమైంది. 

పలువురు ప్రముఖ దర్శకుల వద్ద అసిస్టెంట్‌ దర్శకురాలిగా పని చేసిన సౌజన్య చెప్పిన కథ నాగచైతన్యకు బాగా నచ్చింది. ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే నాగచైతన్యకు అడ్వాన్స్‌ ఇవ్వడం, దర్శకురాలికి కూడా పారితోషికం ఇవ్వడం జరిగిపోయింది. ఈ సమయంలో ఫిదా వల్ల సినిమా ఆగిపోవడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా నిరాశ చెందారు. కథను మార్పులు చేర్పులు చేసి చేయాలని కొందరు సౌజన్యకు సూచించినా కూడా ఆమె మాత్రం అందుకు నిరాకరించింది. త్వరలోనే కొత్త కథతో మళ్లీ నాగచైతన్య వద్దకు వెళ్తాను అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు:

అసిస్టెంట్ ని కొట్టిన బాలయ్య … వైరల్ వీడియో

జోగేంద్ర యువ గర్జనలో బిత్తిరి సత్తి సందడి

మెగా అమ్మాయి తర్వాత మంచు అమ్మాయి