అసిస్టెంట్ ని కొట్టిన బాలయ్య … వైరల్ వీడియో

Posted August 3, 2017 at 16:55

balakrishna beats his assistant in 102 movie opening
నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నాడు. ఈ మద్య తన అభిమానులను లేదా సహాయక సిబ్బందిని లేదా చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఎవరినో ఒకరిని కొడుతూ ఉండటం వల్ల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ వస్తున్నాడు. బాలకృష్ణ తాజాగా తన 102వ చిత్రాన్ని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభించుకున్నారు. ఈ ప్రారంబోత్సవ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు మరియు మీడియా వారు పాల్గొనడం జరిగింది. అంతా సందడిగా ఉన్న సమయంలో, అందరు చూస్తుండగానే బాలయ్య తన వ్యక్తిగత సహాయకుడిపై చేయి చేసుకున్నాడు. అది కాస్త ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతుంది. బాలయ్య మళ్లీ చేయి చేసుకున్నాడు అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే ఒక అభిమాని ఫొటో తీసుకునేందుకు పక్కకు రాగా నిర్దాక్షిణ్యంగా నెట్టేశాడు. మరో అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా ఫోన్‌లాగేసుకుని ఒక్కటి పెట్టాడు. ఇలా బాలయ్య సోషల్‌ మీడియాలో విమర్శల పాలు అవుతున్నాడు. మొదటి నుండి కూడా బాలయ్యది ఇదే తీరు. కాకుంటే ఇటీవల సోషల్‌ మీడియా పుణ్యమా అని ఆ కొట్టే దెబ్బలు అందరు చూస్తున్నారు. వ్యక్తిగత సిబ్బందిని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం, కొట్టడం బాలయ్య మొదటి నుండి చేస్తూనే ఉన్న పని అని ఆయనకు సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు. బాలయ్య ఇప్పటికైనా తీరు మార్చుకుంటే బాగుంటుందని ఆయన అభిమానులు స్వయంగా అంటున్నారు.

మరిన్ని వార్తలు:

జోగేంద్ర యువ గర్జనలో బిత్తిరి సత్తి సందడి

‘లై’తో మహేష్‌కు సంబంధం ఏంటి?

లవకుమార్‌ వచ్చేస్తున్నాడోచ్‌..!

SHARE