‘లై’తో మహేష్‌కు సంబంధం ఏంటి?

special-invitation-to-mahesh-babu-for-lie-movie-pre-release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నితిన్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లై’. ఈ చిత్రానికి ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాను ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను త్వరలో జరిపేందుకు 14 రీల్స్‌ నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలకు మహేష్‌బాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగా ‘లై’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు మహేష్‌బాబును ఆహ్వానించడం, నిర్మాతల కోరిక మేరకు ‘లై’ వేడుకలో పాల్గొనేందుకు మహేష్‌బాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయింది.

ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌తో సినిమాకు భారీ హైప్‌ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి కింది స్థాయి ప్రేక్షకులకు చేరలేదు. సినీ వర్గాల వారు మరియు కొద్ది మంది ప్రేక్షకులకు మాత్రమే నితిన్‌ ‘లై’ గురించి సమాచారం ఉంది. మహేష్‌బాబు ఈ సినిమా వేడుకలో పాల్గొంటే తెలుగు ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించవచ్చనే ఉద్దేశ్యంతో 14 రీల్స్‌ నిర్మాతలు మహేష్‌బాబును రిక్వెస్ట్‌ చేసి మరీ తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం స్పైడర్‌ను విడుదలకు ముస్తాబు చేస్తున్న మహేష్‌బాబు మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అను నేను’ చిత్రంలో నటిస్తున్నాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా నిర్మాతలపై ఉన్న అభిమానంతో ‘లై’ వేడుకలో పాల్గొనేందుకు ముందుకు వచ్చాడు.

మరిన్ని వార్తలు:

లవకుమార్‌ వచ్చేస్తున్నాడోచ్‌..!

రానా, కాజల్‌ల జోడీ అదుర్స్‌