Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు తెలుగు జర్నలిజం రంగంలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఉదయం పత్రికని తిరిగి పట్టాలు ఎక్కించడానికి ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటీవల విజయవాడలో సమావేశమైన ఉదయం మాజీ ఉద్యోగులు ఇందుకు సంబందించిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయం ఎప్పటికి అమలయ్యేను అనుకునేవారికి షాక్ ఇస్తూ సీనియర్ జర్నలిస్టులు కొందరు తమ పరిచయాలని వాడుతూ ఉదయం పునప్రారంభం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కోవలో వారికి అన్ని విధాలుగా అండదండలు అందించడానికి కొన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకి సంబందించిన నాయకులు ముందుకు వచ్చారట. పార్టీ ప్రయోజనాలు, స్వీయ ప్రయోజనాలు దృష్టితో చూసినప్పుడు ఓ పత్రిక మనకుంది అనిపించుకోడానికి సదరు నాయకులు వెనకాడటం లేదట.
ఇప్పటికే ఆంధ్ర పత్రిక తిరిగి పురుడు పోసుకుంది. ఇక ఉదయం కూడా తిరిగి ట్రాక్ ఎక్కితే ఎన్నికల వాతావారణానికి సంబంధించి భిన్న వాదనలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రేసులో వున్న పత్రికలు ఏమి రాస్తాయో, ఎందుకు రాస్తాయో అందరికీ తెలిసిపోయింది. అందుకే వాటికి క్రెడిబిలిటీ అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో పాత పత్రికలు మళ్లీ పురుడు పోసుకోవడమంటే మంచిదే కానీ అవి కూడా తెల్ల చొక్కాలు, ఖద్దరు టోపీల అడుగుజాడల్లో నడిస్తే మాత్రం కొత్త సీసాలో పాత సారా పోసిన చందమే అవుతుంది.
మరిన్ని వార్తలు: