రానా పార్సిల్ లో ఏముంది..?

Excise Officials Checked Rana's Foreign Parcel

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో డైరక్టుగా కాకపోయినా.. ఇన్ డైరక్టుగా రానా పేరు బాగా వినిపించింది. డార్క్ నెట్ ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ మన నగరానికి సరఫరా అవుతుందని తేల్చారు సిట్ అధికారులు దీంతో తెలంగాణ ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచారు. రామానాయుడు స్టూడియోకు ఫారిన్ నుంచి పార్సిల్ వచ్చిందన్న న్యూస్ తో ఎక్సైజ్ మరోసారి అలర్టైంది.

ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ కనకదుర్గ ఆధ్వర్యంలో పది మంది టీమ్ రామానాయుడు స్టూడియోలో తనిఖీలు చేశారు. ఫారిన్ పార్సిల్ కోసం చెక్ చేసినట్లు టీమ్ స్పష్టం చేసింది. విదేశీ పార్శిళ్లలో డ్రగ్స్ వస్తున్నాయన్న సమాచారం ఎంక్వైరీలో తెలిసిందని, అందుకే అప్పట్నుంచి ప్రతి ఫారిన్ పార్సిల్ పై కన్నేసి ఉంచుతున్నామని చెప్పారు ఎక్సైజ్ అధికారులు.

అటు దగ్గుబాటి సురేష్ బాబు కూడా విదేశీ పార్సిల్ వచ్చిందని ధృవీకరించారు. తన కొడుకు రానా వెన్నునొప్పితో బాథపడుతున్నాడని, అది తగ్గించడానికి విదేశాల నుంచి ఓ పరికరాన్ని ఆర్డర్ చేశామని చెప్పారు సురేష్ బాబు. మొత్తం మీద పార్సిల్లో ఏమీ లేదని తేలడంతో రామానాయుడు స్టూడియో జనాలు ఊపిరిపీల్చుకున్నారు. ఒక్కసారిగా అక్కడ ఎక్సైజ్ టీమ్ ను చూసి వాళ్లు కాస్త కంగారుపడ్డారట.

మరిన్ని వార్తలు:

డిగ్గీని వదిలేసిన కాంగ్రెస్

అధికారం వచ్చినా.. బుద్ధి మారలేదు