కేసీఆర్ కు టాలీవుడ్ లవ్ లెటర్

tollywood-celebrities-wrote-a-letter-to-kcr-about-drugs-case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలంగాణ సీఎం కేసీఆర్ కు టాలీవుడ్ పెద్దలంతా కలిసి ప్రేమ లేఖ రాశారు. డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నందుకు కితాబిస్తూనే.. టాలీవుడ్ తో మరింత సున్నితంగా వ్యవహరించాలని కోరారు. ఇప్పటికే విచారణ హుందాగా జరుగుతుండగా.. మరి ఈ సున్నితత్వం ఏంటో సామాన్యులకు అర్థం కావడం లేదు. ఇప్పటికే కేసీఆఱ్ డ్రగ్స్ వాడే వాళ్లంతా బాధితులేనని కొత్త స్టేట్ మెంట్ ఇచ్చారు.
కేసీఆర్ ప్రకటన తర్వాత డ్రగ్స్ కేసు విచారణ కూడా అంతకుముందలా కాకుండా చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. సెకండ్ లిస్ట్ కూడా రాదనే భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంకా సున్నితంగా వ్యవహరించాలని కోరడంలో అర్థమేంటని గులాబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సినీ సెలబ్రిటీలు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఎెక్సైజ్ వర్గాల నుంచి హెచ్చరికలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
రామానాయుడు స్టూడియోలో రానా పార్సిల్ చెక్ చేయడం చిన్న విషయం కాదంటోంది టాలీవుడ్. దగ్గుబాటి ఫ్యామిలీ విషయంలోనే ఇలా జరిగితే.. ఇక బడాబాబులంతా అప్రమత్తంగా ఉండాల్సిందేననే టాక్ వస్తోంది. మరి టాలీవుడ్ సున్నితత్వానికి కేసీఆర్ ఏం రిప్లై ఇస్తారు. నిజంగా మరింత సున్నితంగా ఉంటారా.. లేదంటే రివర్స్ అవుతారా అనేది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు:

రానా పార్సిల్ లో ఏముంది..?

డిగ్గీని వదిలేసిన కాంగ్రెస్

అధికారం వచ్చినా.. బుద్ధి మారలేదు