KCR ప్రభుత్వంలో RTC ని నిర్వీర్యం చేశారు

ponnam

KCR ప్రభుత్వంలో RTC ని నిర్వీర్యం చేశారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. గత పది సంవత్సరాలుగా ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని ,ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదని మండిపడ్డారు. BRS హయాంలో CCS, PF పైసలు వాడుకున్నారని విమర్శించారు. ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ని RTC సంఘాల నేతలు కలిసి, RTC సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకువచ్చారు. RTC సమస్యలపై ఉద్యోగులు ఎప్పుడైనా తనను కలవవచ్చని.. వారికి తానేప్పుడు అందుబాటులోనే ఉంటానని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.