రానా, కాజల్‌ల రొమాన్స్ అదుర్స్‌

rana kajal agarwal romance in Nene Raju Nene Mantri

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ చిత్రం తర్వాత రానా చేసిన ‘ఘాజీ’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా రానాకు నటుడిగా మంచి మార్కులు తెచ్చి పెట్టింది. కమర్షియల్‌గా కూడా సక్సెస్‌ అయ్యింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఘాజీ మంచి వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటించింది. వీరిద్దరు కలిసి నటించడం ఇదే ప్రథమం. అయినా కూడా ఇద్దరి మద్య రొమాన్స్‌ అదిరిపోయింది. ఇద్దరి మద్య కెమెస్ట్రి బాగా వర్కౌట్‌ అయినట్లుగా ట్రైలర్‌లు మరియు పాటలు చూస్తుంటే అనిపిస్తుంది. ఖచ్చితంగా సినిమాకు వీరిద్దరి జోడీ హైలైట్‌గా నిలుస్తుందనే టాక్‌ వినిపిస్తుంది.

కాజల్‌ మొదటి సినిమాను తేజ దర్శకత్వంలో చేసిన విషయం తెల్సిందే. ఆ అభిమానంతో తేజ దర్శకత్వంలో కాజల్‌ చేసేందుకు ఈ సినిమాకు మొదట ఓకే చెప్పింది. ఆ తర్వాత రానాతో చాలా సన్నిహిత్యం ఏర్పడటంతో ఇద్దరి మద్య సీన్స్‌ చాలా బాగా వచ్చాయట. రానాతో వర్క్‌ చేస్తుంటే చాలా సరదగా ఉంటుందని, ఆయన చాలా జోవియల్‌గా ఉంటాడు అంటూ కాజల్‌ చెప్పుకొచ్చింది. రానా కూడా కాజల్‌ను తన ప్రశంసలతో ముంచెత్తాడు. కాజల్‌, రానాల మద్య రొమాంటిక్‌ సీన్స్‌ సినిమాకు హైలైట్‌ అయ్యి, సినిమా కమర్షియల్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

బన్నీ, చరణ్‌ ప్రత్యక్ష యుద్దం.. ఇదే సాక్ష్యం

స్పైడర్‌ ఓవర్సీస్‌ దూకుడు…

ఒక్క సినిమాలో 48 కట్స్‌ ఏంట్ర బాబోయ్‌..!