AP Politics: సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర స్వర్గమా..?

AP Politics: There is no time my friend.. Victory.. Veera Swarga..?
AP Politics: There is no time my friend.. Victory.. Veera Swarga..?

జగన్ ప్రభుత్వంపై పోరాటానికి సమయం లేదని, విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు బాలకృష్ణ అన్నారు. సీఎం జగన్ నూతిలో కప్పలా, తాడేపల్లి ప్యాలెస్‌ తన సర్వస్వంలా వ్యవహిస్తున్నారని బాలకృష్ణ దయ్యబట్టారు. వైసీపీ అక్రమాలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లోకేశ్‌ యువగళంలో ప్రజాగళం కదం తొక్కిందని బాలకృష్ణ అన్నారు. పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించినా విజయవంతంగా పూర్తి చేశారని… ఎంతో మంది ప్రజలను లోకేశ్‌ ఓదార్చారని అన్నారు. ప్రజా సమస్యలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పోరాడుతున్నారని బాలయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక చెత్త ప్రభుత్వం ఉందని… ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేశారని… అమరావతికి భూములిచ్చిన రైతుల ఉద్యమాన్ని అణచివేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పి.. పోలవరాన్ని ప్రాజెక్టును నాలుగేళ్లు అయినా పూర్తి చేయలేదన్నారు. పోలవరాన్ని పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వం జగన్‌ ప్రభుత్వమని మండిపడ్డారు. .

ఏపీలో డ్రగ్స్‌ మాఫియా పెరిగిపోయిందన్న బాలయ్య… డ్రగ్స్‌ దందాలో మాత్రం ఏపీని నెంబర్‌ వన్‌గా నిలిపారన మండిపడ్డారు. ల్యాండ్‌, శాండ్‌ స్కాములతో రూ.కోట్లు దోచుకున్నారని… అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిపోయిందని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు లేవు.. యువతకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. సైకో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్న బాలయ్య…. సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర స్వర్గమా? తేల్చుకోవాల్సిన పరిస్థితి మనదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలోనిర్వహించిన విజయోత్సవ సభ వేదికగా తెలుగుదేశం-జనసేన ఎన్నికల శంఖారావంపూరించాయి.

యువగళం ముగింపు సభకు లక్షలాదిగా..తెలుగుదేశం-జనసేన కార్యకర్తలుతరలిరాగా రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ , ముఖ్యనేతలు వైసీపీ సర్కారుపై సమరభేరి మోగించారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగించిన వైసీపీకు కాలం చెల్లిందని చంద్రబాబు మండిపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయంఅని చెప్పారు. గతంలో ఎన్నో పాదయాత్రలు జరిగినప్పటికీ…. తొలిసారి లోకేశ్ యాత్రపైఅనేక రకాలుగా దాడులు చేసి, ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. అయినప్పటికీయువగళం జనగళంగా మారి… ప్రజాగర్జనకు నాంది పలికిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను తరిమికొట్టారన్న చంద్రబాబు యువతకు ఉపాధి అవకాశాలు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.