ఫుల్ స్వింగ్ లో బాలయ్య పాన్ ఇండియా మూవీ ..!

Balayya pan India movie in full swing ..!
Balayya pan India movie in full swing ..!

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ “NBK 109” (NBK 109) కోసం తెలిసిందే. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్స్ తక్కువే వచ్చినప్పటికీ మూవీ పనులు మాత్రం ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయని తెలుస్తుంది .

షూటింగ్ మాత్రం నిర్విరామంగా బాలయ్య మార్క్ స్పీడ్ లోనే కంప్లీట్ అవుతుంది . మరి లేటెస్ట్ గా ఈ మూవీ కి వర్క్ చేస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ ఒక పిక్ ని షేర్ చేసి ఇప్పుడు షూట్ మోడ్ లో ఉన్నట్టుగా తెలియజేసారు. దీనితో ఈ మూవీ శరవేగంగా కంప్లీట్ అవుతుంది అని చెప్పాలి.

Balayya pan India movie in full swing ..!
Balayya pan India movie in full swing ..!

అలాగే “జైలర్” (Jailer) కు వర్క్ చేసిన ఈ టెక్నీషియన్ నుంచి బాలయ్య మూవీ కి కూడా అదిరిపోయే విజువల్స్ ను అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే ఆ రేంజ్ లోనే వస్తున్నాయి అని కూడా టాక్ ఉంది. ఇక మరిన్ని వివరాలు మున్ముందు ఈ మూవీ నుంచి రానున్నాయి. ఇక ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.