మెగా అమ్మాయి తర్వాత మంచు అమ్మాయి

Manchu Lakshmi Starts In Act YouTube Series

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వెండి తెరపై కంటే బుల్లి తెరపైనే ఎక్కువగా కనిపించాలని సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు ఇటీవల ఎక్కువగా కోరుకుంటున్నారు. పలువురు స్టార్స్‌ రియాల్టీ షోలు, గేమ్‌ షోలు, టాక్‌ షోల పేరుతో ఏదో ఒక ఛానెల్‌లో కనిపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వెబ్‌ సిరీస్‌ అంటూ మొదలైంది. మెగా హీరోయిన్‌ నిహారిక సినిమాల్లోకి రాకముందు ‘ఆవకాయ బిర్యానీ’ అనే యూట్యూబ్‌ సిరీస్‌లో నటించింది. ఆ సిరీస్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కొన్ని ఎపిసోడ్‌లే అయినా కూడా నిహారిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా హీరో వరుణ్‌ సందేశ్‌ కూడా వెబ్‌ సిరీస్‌కు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మంచు వారి అమ్మాయి కూడా వెబ్‌ సిరీస్‌పై దృష్టి పెట్టింది.

ఇప్పటికే బుల్లి తెరపై టాక్‌ షోలతో అలరించిన మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తనదైన సత్తా చాటింది. తాజాగా యూట్యూబ్‌లో కూడా సెన్సేషన్‌ అయ్యేందుకు సిద్దం అవుతుంది. గత కొన్ని రోజులుగా యూట్యూబ్‌ సిరీస్‌పై వర్క్‌ చేస్తుందట. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించి, వారంలో ఒక ఎపిసోడ్‌ చొప్పున విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. వెండి తెరపై నటిగా సక్సెస్‌ అయిన మంచు లక్ష్మి బుల్లి తెరపై అదే అండి యూట్యూబ్‌లో సక్సెస్‌ దక్కించుకుంటుందా చూడాలి. మంచు లక్ష్మి చేయబోతున్న యూట్యూబ్‌ సిరీస్‌ గురించి పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిచేస్తామని ఫిల్మ్‌ మేకర్స్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు:

జోగేంద్ర యువ గర్జనలో బిత్తిరి సత్తి సందడి

మళ్ళీ రావా అంటున్న సుమంత్