బన్నీ సర్‌ప్రైజ్‌ ఏంటో?

Naa Peru Surya Film Unit Members Gives Surprise Gift

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా హీరోల్లో ఇటీవల చాలా దూకుడుగా కనిపిస్తున్న హీరో అల్లు అర్జున్‌. వరుసగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను దక్కించుకుంటున్న అల్లు అర్జున్‌ తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే చిత్రాన్ని షురూ చేశాడు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అయిన ఈ సినిమా దేశ భక్తి నేపథ్యంలో ఉంటుందని, ఇందులో అల్లు అర్జున్‌ ఆర్మీ జవాన్‌గా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. దేశ భక్తి సినిమా కనుక రాబోయే స్వాతంత్య్ర దినోత్సవంకు ఈ చిత్రం నుండి ప్రేక్షకులు ఏదైనా ఆశిస్తారు. సింపుల్‌గా ఫస్ట్‌లుక్‌ను వదలకుండా అల్లు అర్జున్‌ ప్రేక్షకులు మరియు ప్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసినట్లుగా ప్రకటించాడు.

ఆగస్టు 15న ‘నాపేరు సూర్య’ చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఏ ఒక్కరు ఊహించని సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ రాబోతుంది. ఆ గిఫ్ట్‌ టీజర్‌ కావచ్చు అని కొందరు అంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుండి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 15న చిత్రానికి సంబంధించిన ఒక పాటను విడుదల చేయబోతున్నారు. దేశభక్తితో కూడిన పాటను ఆగస్టు 14 సాయంత్రం సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేస్తారని కొందరు భావిస్తున్నారు. ఇది ఎంత వరకు నిజం అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి 3 ఆగస్టు 15న బన్నీ అండ్‌ టీం ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్‌ ఏంటా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు:

మెగా అమ్మాయి తర్వాత మంచు అమ్మాయి

స్పైడర్‌ 16 కోట్లు.. జై లవకుశ 10 కోట్లు