స్పైడర్‌ 16 కోట్లు.. జై లవకుశ 10 కోట్లు

Spyder And Jai Lavakusa Movie Overseas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినిమా మార్కెట్‌ ఇటీవల భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలు, విదేశాల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటుతుంది. కొన్ని సంవత్సరాల వరకు తెలుగు సినిమా ఓవర్సీస్‌లో విడుదల అవ్వడమే గగణం. సినిమా సక్సెస్‌ అయితే రెండవ వారం లేదా మూడవ వారంలో విడుదల చేసేవారు. కాని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కంటే ముందుగానే ఓవర్సీస్‌లో విడుదల చేసేస్తున్నారు. తెలుగు సినిమాలకు ఓవర్సీస్‌ మరో నైజాం అయ్యింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్టార్‌ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా ఇటీవల ఓవర్సీస్‌లు ఒక ఆట ఆడేస్తున్నాయి.

టాలీవుడ్‌లో మహేష్‌బాబు సినిమాలకు ఓవర్సీస్‌లో ఎక్కువగా మార్కెట్‌ ఉంటుంది. మహేష్‌బాబు సినిమా ఫ్లాప్‌ అయినా కూడా ఓవర్సీస్‌లో ఒక రేంజ్‌లో కలెక్షన్స్‌ను వసూళ్లు చేస్తూనే ఉంటుంది. ‘ఖలేజా’ నుండి మహేష్‌బాబు ఓవర్సీస్‌ దున్నుడు స్టార్ట్‌ అయ్యింది. అప్పటి నుండి కూడా మహేష్‌బాబు దుమ్ము దుమ్ముగా ఓవర్సీస్‌లో కలెక్షన్స్‌ను సాధిస్తూనే ఉన్నాడు. అందుకే మహేష్‌బాబు తాజా చిత్రం ‘స్పైడర్‌’ ఏకంగా 16 కోట్లకు ఓవర్సీస్‌లో అమ్ముడు పోయింది. ఇక ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జై లవకుశ’ చిత్రం కూడా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అందుకే ఓవర్సీస్‌లో 10.5 కోట్లకు అమ్ముడు పోయింది. ఈ రెండు సినిమాలు కూడా వారం రోజుల తేడాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఓవర్సీస్‌లో ఈ రెండు సినిమాలు 50 కోట్లు వసూళ్లు చేసి తీరతాయనే నమ్మకం మేకర్స్‌లో వ్యక్తం అవుతుంది.

మరిన్ని వార్తలు:

మెగా అమ్మాయి తర్వాత మంచు అమ్మాయి