గుడ్ న్యూస్ “పుష్ప-2” : అల్లు అర్జున్ బర్త్ డే కి బిగ్ సర్ప్రైజ్..!

good-news-pushpa-2-big-surprise-for-allu-arjuns-birthday
good-news-pushpa-2-big-surprise-for-allu-arjuns-birthday

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ గా సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా పుష్ప 2 ది రూల్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ సినిమా కి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

good-news-pushpa-2-big-surprise-for-allu-arjuns-birthday
good-news-pushpa-2-big-surprise-for-allu-arjuns-birthday

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న పుష్ప 2 నుండి ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ను టీమ్ ప్లాన్ చేస్తోందని టాక్ . దీనికి సంబంధించి త్వరలో పూర్తి డీటెయిల్స్ వెల్లడయ్యే అవకాశం ఉందట. ఫహాద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్ అనసూయ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానున్నది .