తనీష్‌ ఇక సర్దేసుకోవడమే…!

Tanish Rangu Movie Updates

చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన తనీష్‌ హీరోగా మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించడంలో విఫలం అయ్యాడు. తనీష్‌ ఇప్పటి వరకు హీరోగా నటించిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో తనీష్‌ హీరోగా పనికి రాడనే టాక్‌ వస్తుంది. ఇలాంటి సమయంలోనే తనీష్‌ ‘రంగు’ అనే చిత్రాన్ని ఒకే చేసి, నటించాడు. ఆ చిత్రం విడుదలకు ఇబ్బందులు తలెత్తాయి. తనీష్‌కు పెద్దగా క్రేజ్‌ లేకపోవడంతో పాటు, సినిమా పెద్దగా ఆకట్టుకునే నేపథ్యంతో తీయలేదంటూ డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో ఆ సినిమాను అలా వదిలేశారు.

Tanish-Rangu-Movie-Updates

బిగ్‌ బాస్‌ తో తనీష్‌కు గుర్తింపు రావడంతో మళ్లీ సినిమాను విడుదలకు సిద్దం చేశారు. ‘రంగు’ చిత్రం తాజాగా మంచి అంచనాల నడుమ విడుదలైంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. విజయవాడ రౌడీ షీటర్‌ లారా కథతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు. కాని షాకింగ్‌గా ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడంతో పాటు, తనీష్‌ కెరీర్‌ ఇక ఖతమే అన్నట్లుగా ఉంది. మినిమం ఓపెనింగ్స్‌ రాకపోవడంతో కొన్ని థియేటర్లలో షోలను రద్దు చేశారట. ఇక హీరోగా తనీష్‌తో ఏ ఒక్కరు సినిమాలు చేసేందుకు ముందుకు రాకపోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. హీరోగా ప్రయత్నాలు మానేసి, విలన్‌గా సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tanish-Rangu-Movie