బాలయ్య మీదే ఆశాలన్నీ…!

Balakrishna To Do A Film With V V Vinayak

మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఒక్కపుడు సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. తరం మారుతున్న కొద్ది కొత్త తరం దర్శకులు, కొత్త కథలతో వస్తున్నారు ఇప్పుడు. వివి వినాయక్ రొటీన్ ఫార్ములతో సినిమాలు తీసి, జనం చేత ఇంకా వివి వినాయక కెరీర్ ముగిసినట్టే అనిపించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి సన్నిహితుడైన వివి వినాయక్, ఖైదీ నెంబర్ 150 చిత్రం చిరుతో తీసి మంచి విజయంను దక్కించుకున్నాడు. మరల ట్రాక్ లోకి వచ్చాడు అనుకున్నారు. అందరు. కానీ సాయి తో ఇంటెలిజెంట్ చిత్రం తీసి మరల నిరాశ పరిచాడు. ప్రస్తుతానికి సినిమాలు ఏవి చేయకుండా ఉన్నాడు. మంచి ప్రాజెక్ట్ ను తెరకేక్కించాలి అని చూస్తున్నట్టు తెలుస్తుంది.

VV Vinayak's Balakrishna movie titled as 'AK 47'

నిర్మాత సి. కళ్యాణ్ బాలకృష్ణ తో వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించాలి అని ప్రయత్నిచాడు. కానీ ఈ బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ అనే చిత్రం లో నటిస్తున్నాడు. అసలు బాలకృష్ణ తో వివి వినాయక చిత్రం ఉంటుందా అనే సందేహం మొదలైంది. తాజా సమాచారం మేరకు బాలకృష్ణ వివి వినాయక సినిమా ఉండే అవకాశం ఉన్నది. బాలకృష్ణ తో సి. కళ్యాణ్ సంప్రదింపులు చేస్తునట్టు ఫిల్మ్ నగర్ లో టాక్. వివి వినాయక్ కూడా ఈ గ్యాప్ లో మంచి కథను బాలకృష్ణ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. బాలకృష్ణ తో సినిమా తరువాత వివి వినాయక రాజకియలోకి ప్రవేశించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా వీటిపై వివి వినాయక్ నుండి అధికారిక ప్రకటన వెలుబడాల్సిన అవసరం ఉంది.