‘ట్యాక్సీవాలా’ వారం రోజుల కలెక్షన్స్‌

Vijay Devarakonda Taxiwala Movie Latest Collections Report

విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌ జంటగా తెరకెక్కిన ‘ట్యాక్సీవాలా’ గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో నిర్మాతకు కాసుల పంట పండుతోంది. మొదటి రోజే సినిమాకు పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసింది. రెండవ రోజు నుండి వస్తున్న కలెక్షన్స్‌లో ప్రతి రూపాయి కూడా నిర్మాతకు లాభమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. అయిదు కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం రోజుల్లో ఏకంగా 16.2 కోట్ల షేర్‌ను దక్కించుకున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. 30.3 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసిన ఈ చిత్రం లాంగ్‌ రన్‌లో 50 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా చెబుతున్నారు. 2.ఓ చిత్రం వచ్చే వరకు ఈ చిత్రం జోరు కొనసాగడం ఖాయం.

Vijay devarakonda taxiwala

ఏరియాల వారిగా ఈ చిత్రం దక్కించుకున్న షేర్‌ ఇలా ఉంది :
నైజాం : 6.1 కోట్లు
వైజాగ్‌ : 1.35 కోట్లు
ఈస్ట్‌ : 69 లక్షలు
వెస్ట్‌ : 61 లక్షలు
కృష్ణ : 83 లక్షలు
గుంటూరు : 87 లక్షలు
న్లెూరు : 35 లక్షలు
సీడెడ్‌ : 1.4 కోట్లు
యూఎస్‌ : 1.7 కోట్లు
కార్ణటక : 1.5 కోట్లు
ఇతరం : 80 లక్షలు
మొత్తం 16.2 కోట్లు