ఒక రాత్రికి రమ్మని అడిగిన వ్యక్తిని హీరోయిన్‌ ఏం చేసిందో తెలుసా?

లైంగిక వేదింపు గురించి దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, ఇందుకోసం మీటూ ఉద్యమం ఉవ్వెత్తున వచ్చింది. అయినా కూడా కొందరు మహిళలను లైంగికంగా వేదించడం మాత్రం తగ్గడం లేదు. తాజాగా మలయాళ హీరోయిన్‌ నేహా సక్సేనాను ఒక వ్యక్తి లైంగికంగా వేదించేందుకు ప్రయత్నించాడు. యూఏఈ దుబాయిలో ఉండే వ్యక్తి నేహా సక్సేన మేనేజర్‌కు వాట్సప్‌లో మెసేజ్‌ చేశాడు. ఆ మెసేజ్‌లో ఒక రాత్రికి నేహాతో గడిపే అవకాశం ఉంటుంది, ఆమె అందుకు ఎంత తీసుకుంటుంది అంటూ అడిగాడు. ఆమెను ఒక్కసారి ఒప్పించండి అంటూ కోరాడు. ఆ విషయం మేనేజర్‌ డైరెక్ట్‌గా నేహా సక్సేనా వద్దకు తీసుకు వెళ్లాడు. ఒల్లు మండిన నేహా ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Neha Saxena, Elson Lohidakshan

అబుదబికి చెందిన వ్యక్తి నన్ను ఒక రాత్రి కోసం కావాలని నా మేనేజర్‌ను సంప్రదించాడు. ఆ వ్యక్తికి సంబంధించిన చాట్‌, ఫోన్‌ నెంబర్‌, అతడి ఫొటో ఇదిగో అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఇలాంటి నీచులను ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అంటూ నేహా పేర్కొంది. ఇలాంటి వారి వల్లే మహిళలు వర్క్‌ చేయాలన్నా, బయటకు వెళ్లాన్నా కూడా భయపడుతున్నారు అంటూ నేహా సక్సేనా ఆవేదన వ్యక్తం చేసింది. అతడి ఫొటో మరియు ఫోన్‌ నెంబర్‌ షేర్‌ చేయడంతో అతడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆడవారిని అంగడి బొమ్మల మాదిరిగా చూసే ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇండియాకు అతడిని రాకుండా పాస్‌ పోర్ట్‌ క్యాన్సిల్‌ చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

neha saxena