ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టీజర్ – గమ్మత్తైన ఇన్వెస్టిగేషన్ డ్రామా

Agent Sai Srinivasa Athreya Teaser

శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో శ్రీముఖి అన్నగా నెగటివ్ రోల్ లో నటించిన రాకేష్ అనే వ్యక్తి గుర్తున్నాడా? అతని పేరే నవీన్ పోలిశెట్టి. ఇతనే మహేష్ బాబు నటించిన 1- నేనొక్కడినే సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడు ఈ నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పేరే “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. ఈ సినిమా టీజర్ ని ఈరోజే నాని తన ట్విట్టర్ పేజీలో విడుదల చేయగా, విజయ్ దేవరకొండ తన ట్విట్టర్లో షేర్ చేశాడు.టీజర్ ని చూస్తే ఇదొక గమ్మత్తైన ఇన్వెస్టిగేషన్ డ్రామా గా అనిపిస్తుంది. ఇటువంటి సినిమాలు హాలీవుడ్, బాలీవుడ్ లో సాధారణమే కానీ తెలుగులో మాత్రం చాలా అరుదు.

Sai-Srinivasa

చూస్తుంటే ఈ సినిమా నెట్ఫ్లిక్ నిర్మించిన ఏదో హాలీవుడ్ వెబ్ సిరీస్ లాగే అనిపిస్తుంది. టీజర్ మాత్రం మాములుగా లేదు. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తన టేకింగ్ హైలైట్ గా నిలుస్తుంది. మార్క్ కే రాబిన్ అందించిన నేపథ్య సంగీతం ఈ టీజర్ కి మరో ఆకర్షణ. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి శర్మ కూడా చూడటానికి బాగుండడమే కాకుండా తన హావభావాలతో ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఇదో గమ్మత్తైన కామెడీ తో కూడిన ఇన్వెస్టిగేషన్ డ్రామానే. టీజర్ ముగింపులో హీరో తన ఐడి కార్డు చూపిస్తూ, ఎఫ్బిఐ – నెల్లూరు అని చెప్పడం ఆకట్టుకుంది. టీజర్ ని చూస్తుంటే సినిమా ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి మరో కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తుందని అనిపిస్తుంది.